హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదం ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్‌ఆర్ పై ఓ కారులో మంటలు చెలరేగాయి…. స్థానికుల వివరాల ప్రకారం సిద్ధిపేట నుంచి హైదరా బాద్ కు శుభకార్యానికి వెళ్తున్న కారులో పటాన్ చేరు ఓ.ఆర్.ఆర్ పైకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వారంతా సకాలంలో అప్రమత్తమై కిందికి దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అటుగా వెళ్తున్న పటాన్‌చెరు బీఆర్‌ఎస్ నేత మాణిక్ యాదవ్ వారికి సహకరించారు. కారులోని కుటుంబ సభ్యులు అంతా సురక్షితంగా బయటపడగా, కారు పూర్తిగా దగ్ధమైంది.
అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.


Recent Comments