Thursday, November 21, 2024

BREAKING NEWS: CAA రూల్స్‌ను ఇవాళ నోటిఫై చేయ‌నున్న కేంద్ర స‌ర్కారు

న్యూ ఢిల్లీ :మార్చి 11
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై విధివి ధానాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం-2019ను అమల్లోకి తెస్తూ నిబంధ నల్ని ప్రకటించింది కేంద్రం. ఈ చట్టం విధివిధానాలు, అమలు నిబంధనలను కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది.

మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతం సార్వత్రిక ఎన్నికల ముందు సీఏఏను అమలు చేస్తామన్న బీజేపీ, ఆ విధంగానే నోటిఫికేషన్ ప్రకటనకు ముందే సీఏఏను అమల్లోకి తెచ్చింది.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గాని స్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధ నల్ని కేంద్రం రూపొంది స్తోంది.

అన్ని రాష్ట్రాల అధికారు లతో సీఈసీ భేటీ.. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. సీఏఏ చట్టం 2019 డిసెంబరులో ఆమోదం పొందింది.

రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. నిబంధనలు లేకపోవడం వల్ల ఇంత వరకు ఈ చట్టం అమల్లోకి రాలేదు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి