ఓ డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న బాలుడిని ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Thank you for reading this post, don't forget to subscribe!పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ అల్వాల్ ఇందిరా గాంధీ చౌరస్తా సమీపంలో గల రిలయన్స్ స్మార్ట్ కు సరుకుల లోడుతో డీసీఎం వ్యాన్ వచ్చి ఆగింది. సరుకులు దింపడానికి దుకాణానికి ఎదురుగా డీసీఎం వాహనం నిలిపిన డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయక పోవడంతో అదుపు తప్పిన వాహనం రోడ్డుపైకి వచ్చి తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్లుతున్న తల్లి కొడుకును ఢీ కొట్టింది.తల్లికి తీవ్రగాయాలు కాగ కొడుకు తిరుపాల్(9) అక్కడిక్కడే మృతి చెందాడు.
గాయాలను సైతం లెక్కచేయకుండా విగత జీవి అయిన కుమారున్ని వొడిలోకి తీసుకుని తల్లి హృదయ విధాయకరంగా రోదించడం చూపరులను సైతం కంటతడి పెంటించాయి. మృతి చెందిన బాలుడి తండ్రి భరత్ కు రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ జరుగడంతో రైతు బజార్ వద్దగల ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ఇద్దరు పిల్లలను తీసుకుని భర్తను చూడడానికి వచ్చి తిరిగి వెళ్లుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయక పపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
Recent Comments