Friday, November 22, 2024

అధికార పార్టీ వారికే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు – బిజెపి పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్

రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (మార్చ్ 4 ):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పేద ప్రజలకు,అర్హులకు మాత్రమే పంపిణీ చేయాలని నిరసన చేస్తూ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్,సీనియర్ నాయకులు ఆరుముళ్ళ పోశంలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరుపేదల ఇండ్ల నిర్మాణం కొరకై రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ల పంపిణీ విషయంలో దగా చేస్తూ అర్హలైన పేద ప్రజలకు అందించకుండా అధికార పార్టీ వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నట్లుగా మున్సిపాలిటీ నోటీస్ బోర్డ్ లో వేసినటువంటి అర్హుల లిస్టులో స్పష్టమవుతుందని అన్నారు. పట్టణానికి సంబంధించి అధికార పార్టీ అధ్యక్షుడు వారి స్కూల్ హెడ్మాస్టర్ ఇతర సిబ్బందులకు డబల్ బెడ్ రూమ్ అర్హులుగా కేటాయించడం జరిగింది, అదేవిధంగా డబల్ బెడ్రూంలో అర్హుల సర్వే రెవెన్యూ అధికారులు ఇటీవల చేపట్టినప్పుడు స్థానిక కౌన్సిలర్లు వారితో కలిసి వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే డబ్బులు తీసుకొని అర్హులుగా ప్రకటించినట్టు కనిపిస్తోందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వారి సొంత పార్టీ వారికే డబల్ బెడ్రూంలు పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది, గతంలో దళిత బంధు విషయంలో సొంత పార్టీ నాయకులకే దళిత బంధు కేటాయించుకోవడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు అన్యాయం చేస్తూ సొంత పార్టీ వారికే డబల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించారని తెలిపారు. అర్హులకు మాత్రమే డబల్ బెడ్రూంలు కేటాయించాలి, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో జరిగినటువంటి అవకతవకాల్ని కోర్టు ముందు పెడతామని హెచ్చరించారు. అందరికీ న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి వేల్పుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జంగపెల్లి మల్లయ్య, వైద్య శ్రీనివాస్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు, మేదరి లక్ష్మి, ఓబీసీ జిల్లా నాయకులు ముద్దసాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు వేముల అశోక్, బిజెపి పట్టణ కార్యదర్శి బైరి మల్లేష్, బీజేవైఎం పట్టణ కార్యదర్శి బద్రి సతీష్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బంగారి ప్రసాద్ దొంతమల్ల శ్యామ్, బీసీ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి సాఠపురి శివ, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు జాడి పర్వతాలు, నాయకులు పినమల్ల బాబు, శ్రీదేవి,రజని,మల్లక్క,రూప తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి