– గిర్నూర్ గ్రామ అధ్యక్షుడు రాజు యాదవ్

రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ :
రాష్ట్రంలో రానుంది బీజేపీ సర్కరేనని గిర్నూర్ గ్రామ అధ్యక్షులు రేండ్ల రాజు యాదవ్ అన్నారు. బుధవారం బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలో ప్రజా గోస బీజేపీ బరోస కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా కార్యదర్శి ఆడే మానాజి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు, పంచాయతీలకు బీజేపీ సర్కార్ నిధులు ఇస్తుందని కానీ వాటికి గులాబీ రంగేసి రాష్ట్రం సోకులు చేస్తుందని మాధవ రావు ఆమ్టే అన్నారు.
కార్యక్రమంలో మండల కన్వీనర్ బత్తిని సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పోరెడ్డి శ్రీనివాస్, మండల నాయకులు పెరుగు సంతోష్, రాకేష్, బలిరం, లింగన్న, ఆడే సంతోష్, గిర్నూర్ నాయకులు ఇందురి రాజు, గొర్ల సునీల్, జంబుగా శేకర్, అనిల్, రెండ్ల సాయి చరణ్, జక్కుల ప్రసాద్,గెడం పవన్, ఆకాష్, గోల్లనాగు లచ్చన్న, మునేశ్వర్ అజయ్, సురాజ్, నాని, నారాయణ, గణపతి,శేషారావు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments