రిపబ్లిక్ హిందుస్థాన్ : సోమవారం భారతీయ జనతా పార్టీ నేరడిగోండ మండల కార్యవర్గ సమావేశాన్ని మండల కేంద్రంలోని సూర్య గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, మండల నూతన ఇంచార్జీ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ రావ్ ఆమ్టే హాజరయ్యారు. మొదట జాతీయ గీతాన్ని ఆలపించి సమావేశాన్ని ప్రారంభించారు. వక్త చొక్కపల్లి రాములు నూతన ఇంచార్జీని అందరికి పరిచయం చేశారు. అనంతరం మండల అధ్యక్షులు సోసయ్య హీరాసింగ్ మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా అందరికీ తెలిసిందేనని అన్నారు. అన్ని పార్టీలకు నాయకులు ముఖ్యం, కానీ బీజేపీ కి మాత్రం కార్యకర్తలే ప్రధానమని అనేక సందర్భాల్లో రుజువైందని ఈ విషయాన్ని పదేపదే చాలా సందర్భాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తెలిపారని గుర్తు చేశారు. పార్టీ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావాలంటే మొదట పోలింగ్ బూత్ స్థాయిలో పటిష్టంగా ఉంటేనే సాధ్యమని ఇటివల మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు ప్రత్యేకంగా విఐపిల ముందు గ్యాలరిలో పోలింగ్ బూత్ అధ్యక్షులకు సీట్లు కేటాయించారంటే పార్టీకి ప్రతీ కార్యకర్త ఎంత ముఖ్యమో అర్థమవుతుందన్నారు. అనంతరం మండల నూతన ఇంచార్జీ మాధవ్ రావ్ ఆమ్టే మాట్లాడుతూ…. రాబోయే ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా అందరూ కంకణ బద్ధులై ఐక్యంగా పనిచేయాలని, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీయే అని చాలా సర్వేల్లో తేలిందన్నారు. ఇప్పుడు పార్టీకి గొప్ప అవకాశం ఉందని ఈ వాతావరణాన్ని ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే ఎవరు కూడా మనల్ని ఆపలేరన్నారు. కార్యవర్గ సమావేశ అనంతరం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పార్టీని ఏవిధంగా బలోపేతం చేయడం అనే విషయమై చర్చించి తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు, వివిధ మోర్చల అధ్యక్షులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు
బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments