కొంతకాలం క్రితం గ్రామాల్లో, పట్టణాల్లో పక్షుల కిలకిల రాగాలు సందడి చేసేవి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి అరుపులు కాదు కదా, పక్షులను చూడటమే గగనంగా మారింది. అందుకు ముఖ్య కారణం, పక్షులకు సరైన గూళ్లు నిర్మించుకోవడానికి ఆవాసాలు లేకపోవడం, నీరు ఆహారం దొరక్క పోవడమే. ఈ సంగతి గుర్తించిన అదిలాబాద్ జిల్లా బోథ్ గ్రామానికి చెందిన జక్కుల వెంకటేష్ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్థు పక్షులను రక్షించాలని ఉద్యమం మొదలు పెట్టాడు. అంతేకాదు చెట్లపై పక్షుల కోసం ప్రత్యేకంగా గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. బర్డ్ ఫీడర్ లను ఎర్పాటు చేస్తూ పక్షుల సంరక్షణకై కృషి చేస్తున్నారాయన. మనిషికి మనిషి సహాయం చేయలేని ఈ రోజుల్లో తన చుట్టూ ఉన్న పక్షులను, జంతువులకు సహాయం అందిస్తూ వాటిని రక్షించాలని కంకణం కట్టుకుని “ప్రకృతితో స్నేహం – పక్షులకు సహాయం ” అనే గొప్ప కార్యక్రమాన్ని జక్కుల వెంకటేష్ చేపడుతున్నారు.

పక్షులను, గోవులను రక్షించాలని వాటి ఉపయోగాలను తెలుపుతూ ఊరూరా తిరుగుతూ కలిసిన ప్రతి ఒక్కరినీ పక్షులకు ఆహారం, నీరు అందించాలని కోరుతూ బర్డ్ ఫిడర్ ను బహూకరిస్తు అవగాహన కల్పిస్తున్నారు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం చేపట్టి మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ కాలుష్యము, గోవుల రక్షణ, పక్షుల రక్షణ వంటి వాటిపై, వాటివల్ల ఉండే ఉపయిగలపై సొదరణలతో వివరిస్తూ వారిచే కార్యక్రమాలు చేపడుతున్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో బర్డ్ ఫీడర్ లు అందించి, పుట్టిన రోజులకు చాక్లెట్స్ లాంటివి కాకుండా మొక్కలు, మంచి పుస్తకాలు, బర్డ్ ఫిడర్ లను బహుమతిగా అందిస్తూ సమాజంలో చైతన్యాన్ని తీసుకురావాలని చైతన్య పరుస్తున్నారు.

రాజకీయ నాయకులను, అధికారులను కలుస్తూ వారికి బర్డ్ ఫీడర్ లను అందిస్తూ మరికొంత మందికి ఈవిధంగా చేయాలని మీచే సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.
జక్కుల వెంకటేష్ ది సాధారణ జీవితం, తన జీవనోపాధికి బోథ్ గ్రామంలోని మార్కండేయ ఆలయం పక్కన గోమాత పూజ స్టోర్ ఏర్పాటు చేసుకుని సాదాసీదా జీవనాన్ని సాగిస్తుంటారు. ఆయనకు వచ్చే ఆదాయం తక్కువే కానీ అందులో నుండి పక్షుల కోసం సొంతంగా బర్డ్ ఫీడర్ లు కొని వివిధ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తు అవగాహన కల్పిస్తున్నారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే …

నా బాల్యంలో మా ఇంటి ముందు ఇంట్లో పిచ్చుకలు తిరుగుతూ ఉండేవి, ఇంట్లో సైతం గూడు కట్టుకుని ఉండేవి, ఆరుబయట ధాన్యాలు ఎండలో పోస్తే అందులో ఉండే పురుగులను, కీటకాలను తిని బ్రతికేవి, వాటితో మా ఇల్లు సందడిగా ఉండేది, కానీ అవి నేడు కనమరుగు అయ్యాయి, నాడు ఊరంతా కాకుల గోల, రామచిలుకల సవ్వడి, వివిధ రకాల పక్షులను చూస్తూ వాటితో స్నేహం చేస్తూ నా బాల్యంలో ప్రకృతితో గడిపాను, కానీ ఇప్పుడు వాతావరణ ప్రభావమో, కాలుష్యమో, రేడియేషన్ ప్రభావమో తెలీదు గానీ పక్షుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది, ఎవరైనా చనిపోతే పిండం పెడితే కాకుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.
వ్యవసాయంలో క్రిమి కీటకాలను తిని రైతాంగానికి అండగా ఉన్న పక్షి జాతి నేడు విష రసాయనాలు వలన అంతరించి పోతుంటే బాధకలుగు తుందని, మనిషికి కష్టమొస్తే సాటి మనిషి సహాయం చేస్తుంటారు. కానీ నోరు లేని పక్షులకు, జంతువులకు కనీసం నీళ్ళు అందించేమనుషులు కరువయ్యారని అందుకే పక్షి జాతిని రక్షించుకోవాలని నడుం బిగించి నాకున్న ఆదాయం లో నుండి కొంత కర్చు చేసి వాటి రక్షణ కోసం వినియోగిస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఈ వేసవి కాలంలో అందరూ మీ ఇంటి స్థలాలలో, డాబలపై, కార్యాలయాల్లో బర్డ్ ఫీడర్ లను ఏర్పాటు చేసుకుని ,పక్షుల కోసం నీటిని, వాటికి ఆహారాన్ని ఉంచి వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు. ఆయనతో మీరు మాట్లాడాలనుకుంటే 9182140511 నంబర్ కు కాల్ చేయండి.
ఏదేమైనా పక్షుల కోసం ఆయన చేస్తున్న కృషి కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments