వెబ్ డెస్క్ : మేజర్ సర్జరీ పూర్తైందంటూ పోస్ట్..! పిచ్చైకారన్ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్ ఆంటోనీకి గాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత విజయ్ తొలిసారి స్పందించారు.
ప్రమాదం తర్వాత తొలిసారి స్పందించిన విజయ్ ఆంటోనీ.. మేజర్ సర్జరీ పూర్తైందంటూ పోస్ట్..!
బిచ్చగాడు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ . ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం పిచ్చైకారన్ (బిచ్చగాడు-2) చేస్తున్నాడు. అయితే ఇటీవలే మలేషియా సమీపంలోని లంగ్‌కావి దీవి లో షూటింగ్‌లో భాగంగా జెట్ స్కై విమానంలో వెళ్లే సీన్లు చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్ ఆంటోనీకి గాయాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ ఆంటోనీ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, కోమాలో ఉన్నాడంటూ పలు వైబ్‌సైట్లలో సైతం వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం తర్వాత విజయ్ తొలిసారి స్పందించారు.
ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్.. ట్విట్టర్ వేదికగా తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేశారు. ‘డియర్ ఫ్రెండ్స్.. మలేషియాలో పిచ్చైకారన్(బిచ్చగాడు 2) షూటింగ్ సమయంలో నేను ప్రమాదానికి గురయ్యా. నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత త్వరలో మీతో మాట్లాడతాను. ఈ కఠిన పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ’ అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆయన అభిమానులు విజయ్ ఆంటోనీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments