బాపట్ల జిల్లా , జనవరి 02 :
బాపట్ల జిల్లాలో కిరాతకం జరిగింది,నడిరోడ్డుపై భర్తను భార్య కొట్టి చంపిన ఘటన బాపట్ల జిల్లా లో జరిగింది.
అమరేందర్ కుటుంబం కొంతకాలంగా బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కొత్త పాలెంలో ఉంటోంది. అయితే ఎమైందో ఏమో గాని,వీళ్లిద్దరూ ఒక్కసారిగా ఈరోజు ఉదయం నడిరోడ్డు పైకి వచ్చి గొడవపడ్డారు..
మాటామాటా పెరిగి పరస్పరం కొట్టుకున్నారు. విచక్షణ కోల్పోయిన భార్య.. భర్త తలపై కర్రతో బలంగా కొట్టింది,దీంతో అమరేందర్ కిందపడిపో యారు. వెంటనే అమ రేందర్,గొంతుకు తాడుతో బిగించి, నడీ రోడ్డుపై గ్రామస్తుల సమక్షంలోనే భర్తను చంపేసింది,
ఈ హత్య జరుగుతుండగా గ్రామస్తులు ఎవరు ఆమెను ఆపడానికి ప్రయత్నం చేయలేదు వీడియోలు తీస్తూ…చూస్తూ ఉండి పోయారు. మనుషుల్లో మానవత్వం ఎందుకు క్షీణిస్తుంది? కళ్ళఎదుటే ఒక మనిషిని చంపుతుంటే ఎందుకు ఆపలేకపోతు న్నారు
గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. అమరేందర్ మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
అయితే మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments