రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ :
మండలం కేంద్రం లో సాయంత్రం ముక్కా శ్రీనివాస్ అనే వ్యాపారి దుకాణం పై సిసి ఎస్ బృందం జరిపిన ఆకస్మిక దాడిలో నిందితుడి వద్దా రూ.27 వేలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 675 కిలోల బెల్లం, 770 కేజీల ఆలం కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పట్టుబడిన నిషేధిత పదార్థాల విలువ మొత్తం రూ. 46 వేల వరకు ఉంటుందని సిసిఎస్ అధికారులు తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితుడిని నేరడిగొండ పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చోడా లో ఠాకూర్ ప్రతాప్ సింగ్
శుక్రవారం మధ్యాహ్నం సిసిఎస్ బృందం ఇచ్చోడా మండల కేంద్రం లోని ఠాకూర్ కిరాణా దుకాణం పై ఆకస్మికంగా దాడి చేయగా ఠాకూర్ ప్రతాప్ సింగ్ సింగ్ అనే నిందితుడి వద్ద నుండి నిషేధిత గుట్కా ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 17200 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితుడిని స్థానిక పోలుస్ స్టేషన్ కు అప్పగించారు.
Recent Comments