రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బైక్ ర్యాలీకి ఘనంగా ఆదిలాబాద్ జిల్లా నుండి వీడుకోలు పలికిన జిల్లా ఎస్పీ
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుండి ఢిల్లీ వరకు ఈనెల 15వ తారీఖున చేరుకునేలా 40 మంది సిబ్బందితో 20 మోటార్ సైకిల్ లతో బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ మంగళవారం రోజు ఆదిలాబాద్ పట్టణంలోకి ప్రవేశించి బుధవారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్రానికి బయలుదేరింది. ఈ ర్యాలీకి ఆదిలాబాద్ జిల్లా పోలీస్ తరఫున జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఘనంగా వీడ్కోలు తెలిపారు. ఈ ర్యాలీ లో దక్షిణ భారతదేశం నుండి సౌత్ సెంట్రల్ రైల్వే, సదరన్ రైల్వేస్, సౌత్ వెస్ట్ రైల్వేస్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ ఈ ఐదు రైల్వే జోన్ ల నుండి 4 బైకులు 8 మంది సిబ్బందితో మొత్తం 20 బైకులు 40 సిబ్బందితో ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుల్స్, ఒక ఏఎస్ఐ, నలుగురు ఎస్సైలు(ఇద్దరు మహిళా ఎస్సైలు) పాల్గొన్నారు. దేశంలోని అన్ని ప్రదేశాల నుండి రైల్వే సిబ్బందితో కలిసి ఇలాంటి ర్యాలీలు ఆగస్టు15వ రోజున దేశ రాజధాని ఢిల్లీని చేరుకుంటాయి.

ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం వల్ల దేశ ప్రజలలో దేశభక్తిని మరింత పెంచే విధంగా తోడ్పాటునందిస్తాయని తెలిపారు. ప్రజలందరూ ఆజాధిక అమృత్ మహోత్సవంలో భాగంగా రానున్న ఈ 75 వ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఇంట్లో, ప్రతి వాడన జాతీయ జెండ ను ఎగరవేసి ఈ శుభ దినాన్ని ఘనంగా జరుపుకోవాలని, ఈ విధంగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయాలని తెలియజేశారు. అదేవిధంగా ఈ ర్యాలీ కి ఎటువంటి ఆటంకాలు కలగకుండా శుభప్రదంగా ఢిల్లీ వరకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ, వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది పోలీసులు, రెండవ పట్టణ సీఐ కే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Recent Comments