ప్రేమికులకు సంబంధించిన వివిధ రకాల సందేశాలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. ప్రధానంగా ఆటో వెనుక రాసే సందేశాలు నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంటాయి.
Thank you for reading this post, don't forget to subscribe!తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ ఆటో డ్రైవర్ తన వాహనం వెనుక రాసిన సందేశం.. ప్రేమికులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. ఆటో డ్రైవర్ కరెక్ట్‌గా చెప్పారంటూ… కామెంట్లు చేస్తున్నారు.
బెంగళూరులో (Bangalore) ఓ ఆటో డ్రైవర్ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాడు. సాధారణంగా ఆటోల వెనుక వివిధ రకాల సందేశాలను రాయడం సర్వసాధారణం. అయితే ఈ ఆటో డ్రైవర్ (Auto driver) రాసిన సందేశం ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రేమలో విఫలమైన వారు.. ఈ సందేశం చూసి ”అవును.. ఇది నిజమే కదా”.. అంటూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఇతను తన వాహనం వెనుక ఏం రాశాడంటే.. ”Love is Life But Lover is Not Wife”.. అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ప్రేమికులంతా దంపతులు కాలేరు అనే అర్థం అచ్చేలా ఇతడు రాసిన సందేశం అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది ప్రేమికులు ఇతడి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ”ఇతను చెప్పింది నిజమే”.. అంటూ కొందరు, ”ప్రేమ గురించి బాగా చెప్పావ్.. బ్రదర్”.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. జనవరి 29న షేర్ చేసిన ఈ ఫొటో.. ప్రస్తుతం 2వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Recent Comments