epaper
Saturday, January 24, 2026

Raahifalalu: నేటి రాశి ఫలాలు 13-08-2024

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


  
మేషం
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు  నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం
విలువైన  వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.

మిధునం
నూతన  రుణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం
చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయట మానసిక ఒత్తిడులు అధికామౌతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు ఫలించవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం
అనుకున్న పనులు అనుకున్న  విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.  మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

కన్య
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత  నిరాశ పరుస్తాయి.  వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి.

తుల
చిన్ననాటి మిత్రుల  కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన  పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

వృశ్చికం
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ  తప్ప  ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  ఉద్యోగాలలో అధికారుల నుండి  ఒత్తిడులు పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.

ధనస్సు
దూరపు బంధువుల నుండి  శుభకార్య  ఆహ్వానాలు అందుకుంటారు.  చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.  దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.  వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

మీనం
బంధువులతో ఊహించని  వివాదాలు కలుగుతాయి.  కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
 

.                 శుభమస్తు!
        _గోమాతను పూజించండి_
        _గోమాతను సంరక్షించండి_
                    

లోకా సమస్తా సుఖినోభవన్తు!
రేపటి తరానికి బతుకు, భద్రత మంచి ఆలోచన విద్యాబుద్ధి నేర్పండి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!