పెళ్ళికి 10500/- వేల రూపాయల నిత్యావసర సరుకులు అందించిన రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకులు…
లింగాపూర్ : పేదింటి ఆడబిడ్డలకు షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ, రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ పెద్దన్నగా వ్యవహారిస్తున్నారని రెహమాన్ ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ అన్నారు. కొమురం భీం జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద రైతు ఆడే పంచఫులా బాయి సీతారాం దంపతుల కుటుంబ ఆర్థిక పరిస్థితిని రెహమాన్ ఫౌండేషన్ ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ గారు *చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ కి వివరించి, కూతురు ఆడే భూలిబాయి వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ తన రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ వంతుగా రూ.10500/- వేల రూపాయలు విలువైన నిత్యావసర సరుకులను గురువారం అమ్మాయి తల్లిదండ్రులు ఆడే పంచఫులా బాయి సీతారాం గారికీ అందజేశారు.
పేద కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ గారికీ ఆడబిడ్డ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ మాట్లాడుతూ…. పేదింటి ఆడబిడ్డలకు షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ, రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ పెద్దన్నగా వ్యవహరిస్తూ, తనవంతుగా ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. సామాజిక సేవలో భాగంగా రెహమాన్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పవార్ ఘమా బాయి, జాధవ్ కౌసల్యా బాయి, డాక్టర్ రాజ శేఖర్, జాధవ్ శ్రీనివాస్, చవాన్ విశాల్, రాథోడ్ సచిన్, జాధవ్ సుశీల్, జాధవ్ మారుతీ, జాధవ్ అజేష్, జాధవ్ కైలాష్, రాథోడ్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments