రిపబ్లిక్ హిందుస్థాన్, సిర్పూర్ (యు) 28 :
సిర్పూర్ (యు) మండలంలోని మహాగం సమీపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిర్పూర్ (యు) ఎస్ ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారంగా అతివేగంగా రెండు వాహనాలు నడుపుతూ ద్విచక్ర వాహనాలు రెండు ఢీకొనడంతో లింగాపూర్ మండలం పిట్టగూడా గ్రామానికి చెందిన మరప లింగు కుమారుడు మరప శంభు (35) అక్కడికక్కడే మృతి చెందారని ఎస్సై తెలిపారు. మరో ముగ్గురికి ఆ వాహనాలపై వెళ్తున్న లాల్ ప్రసాద్, గణేష్, చంద్రకాంత్ లకు తీవ్ర గాయాలు కావడంతో వారికి చికిత్స నిమిత్తం 108 ద్వారా ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. విషయం తెలియగానే అసిఫాబాద్ డిఎస్పి కరుణాకర్, జైనూరు సిఐ రమేష్ , సిర్పూర్ (యు)ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి జైనూర్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావు, మాజీ ఎంపీపీ కొడప విమల ప్రకాష్ సందర్శించి గాయాల పాలైన వారికి వాహనములో ఎక్కించి చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతిని అన్న కొడుకు మర్ప హనుమంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.


Recent Comments