గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
పోస్టులు అభ్యంతర కరంగా ఉన్నాయని చెప్పినా గూగుల్ , యూట్యూబ్ తొలగించలేదని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.
కోర్టు ఆదేశాలు లేదా అధికారిక ఉత్తర్వులు ఏదో ఒకటి ఉంటే తప్ప తొలగించలేమని గూగుల్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెంటనే ఈ పోస్టులు తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మరికొందరిని ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్‌ను ఏజీ శ్రీరామ్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 6 వారాలకు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments