రామకృష్ణాపూర్ జనవరి 4 ( రిపబ్లిక్ హిందుస్థాన్) :
రామకృష్ణాపూర్ రామాలయం ఆలయంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న స్వాములకు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అయినటువంటి భారతదేశంలో కుల మత భేదాలు లేకుండా సోదర భావంతో మెలుగుతూ జీవనం కొనసాగించాలని అయ్యప్ప స్వామి శబరిమల దర్శనానికి వెళ్తున్న వారి ప్రయాణం సాఫీగా సాగాలని సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన రామాలయం అయ్యప్ప స్వామి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ముస్లింమైనారిటీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఖాజాషరీఫ్, మోహిత్,పాషా, తహర్, ఇస్మాయిల్, ఖలీం, గౌస్, మేరాజ్, అయ్యప్ప స్వాములు అమర్, కట్కూరి శ్రీనివాస్, సురేందర్, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు సుదర్శన్ గౌడ్, జిఎస్ఆర్ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్, కౌన్సిలర్ లు పోగుల మల్లయ్య, సుధాకర్, పోలం సత్యం, సతీష్ పాల్గొన్నారు.



Recent Comments