Wednesday, February 5, 2025

కోటప్పకొండ – విశ్వబ్రాహ్మణులు

రిపబ్లిక్ హిందుస్థాన్ :
విశ్వబ్రాహ్మణ వంశీయులు కి కోటప్పకొండ కి ఒక ప్రత్యేక అనుభంద చరిత్ర ఉన్నది.పలనాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం శివరాత్రి తిరునాల్లకి ప్రతేకముగా ప్రభలు ఊరేగింపు గా అద్భుతం గా అలంకరణ తో వస్తాయి.
ఈ ప్రభలు కోటప్పకొండ చుట్ట పక్కల ఉన్న పల్లెటూర్లలోని విశ్వబ్రాహ్మణ వంశీయులు చేత ఆయా గ్రామస్తులు పెద్దలు తయారు చేయిస్తారు.
వినుకొండ దగ్గర ఉన్న కనుమర్లపూడి లోని విశ్వబ్రాహ్మణ వంశీయులు వీరయ్యచార్యులు, శరభయ్యా చార్యులు గారి చేత నిర్మాణం అయిన ప్రభ చూడడానికి ప్రజలు రెండు వరుసల్లో బార్లు తీరేవారు.వీరు కొండ వద్ద బొమ్మల నెలవు నిర్వహణ చేసేవారు. అంగి, మంగి అని రెండు మర బొమ్మలు అనగా ఈనాడు మనం ఇంజనీరింగ్ వారు చెప్పుకునే రోబోట్లు తయారు చేసి ప్రదర్శన చేసేవారు. ఆంగి సర్పంచ్ గారు కరణం గారు వచ్చారు కుర్చీ వెయ్యి అని అంటే మంగి కుర్చీ తెచ్చి వేసేది.అటువంటి మర బొమ్మలు కనుమర్ల పూడి విశ్వబ్రాహ్మణ వంశీయులు విజ్ఞాన ప్రదర్శనకి ప్రజలు ఆశ్చర్య పోయేవారు.చరిత్ర లో ఆయుర్వేద వైద్యం చేసే సిద్దనాగర్జునచార్యులు ఒకరు.వీరి వంశం వారే సిద్దు ఇంటిపేరు ఉన్న విశ్వబ్రాహ్మణ వంశీయులు.ఈ సిద్దు ఇంటిపేరు కలిగిన కోటయ్యచార్యులు వారు ఈ కోటప్పకొండ క్షేత్రం ఆలవాలంగా తపస్సు చేసినారు.వీరి శివ ఉపాసకులు ఆనాటి నరసరావుపేట జమీందారు గారికి భార్య గారికి వచ్చిన కడుపు నొప్పి దోష నివారణ కోసం ఆయుర్వేద చికిత్స ఎన్నో ప్రాంతాల్లో చూపించి విసిగి పోయిన జమీందారు గారు కోటప్పకొండ లో ఉండే సిద్దు కోటయ్యచార్యులు గారి వైద్యం వలన నయం అయ్యింది.కోటయ్య చార్యులు గారికి గోంగూర మాన్యం అనే పేరు తో సుమారు వందల ఎకరాల మాన్యం ఇచ్చారు.ఆ కోటయ్యచార్యులు గారి సమాధి లింగం కోటేశ్వర లింగం అయ్యింది.అక్కడ ఉండే లింగములలో ఎది సమాధి లింగం అనేది పరిశోదన చేయాలి.సహజముగా చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య అనే పేరు ఆ ఆయుర్వేద వైద్యము వారి నామమే అయితే శివుడు చెవిటి వాడని బిగ్గరగా చెప్పలి అని కాలక్రమేణా ఇలా మారింది.వారి సంతానం కూడా అదే రీతిన సమాధి చెందారు.ఇప్పుడు దక్షిణా మూర్తి దేవాలయం గా మారిపోయింది.శిల్ప శాస్త్రములో ఎక్కడ కూడా లింగ రూపములో దక్షిణ మూర్తి లేదు కానీ ఇక్కడ లింగ రూప దక్షిణ మూర్తి అని అంటున్నారు.
పక్కన ఉన్న గొనేపుడి లో ఉండే ప్రముఖ శిల్పి గారు అయిన సిద్దు వెంకటేశ్వర్లు గారికి ఈ చరిత్ర తెలుసు.ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు అంటే ఇద్దరు శిల్పులపనితనానికి ప్రతిభకు నిదర్శనంగా ఇందిరాగాంధి గారి చేత సత్కారం పొందినారు.వారిలో ఒకరు సిద్దు వెంకటేశ్వర్లు గారు.ఈయనకు వివాహం కాలేదు చివరి రోజుల్లో విటంరాజుపల్లె లో కాలం గడిపారు. కోటప్పకొండ మెట్ల పక్కన ఉన్న విశ్వబ్రాహ్మణ సత్రం మొదటిగా బల్లికుర్వ మండల ముక్తేశ్వరం గ్రామానికి చెందిన కుందుర్తి శరభమ్మ గారు సుమారు 1000 రూపాయల వ్యయముతో పామర్తి నాగభూషణ శర్మ గారు పౌరోహిత్య ఆధ్వర్యం లో నెలకొల్పబడినది.

ప్రతి దేవాలయం కు విశ్వకర్మ వంశీయులు కి కచ్చితంగా సంబంధం ఉంటుంది కాలక్రమేణా కోటప్పకొండ లోని విశ్వకర్మ వంశీయుల యొక్క అసలు చరిత్ర మరుగున పడి పోయింది.ఈనాటికీ కూడా పూర్వకాలపు జానపద సాహిత్యం లో ఈ విషయాలు చెప్పేవారు.చరిత్ర గ్రంధస్తం చేసే నాటికి తారుమారు అయ్యియి.ఆనాటి వారికి ఈ విషయాలు తెలిసిన విశ్వబ్రాహ్మణ అన్న విషయాలు తీసివేసి చరిత్రలు రాశారు.దాచేపల్లి వాస్తవ్యులు స్వర్ణ సుబ్రమణ్య కవి గారు ఈ విషయములు పైన పరిశోధన చేశారు.

విశ్వబ్రాహ్మణ వంశీయులు ఎన్నో చరిత్రలు పోగొట్టుకున్న వాటిలో ఇది ఒకటి.విశ్వబ్రాహ్మణులు లేని చోట కథలు చెప్పండి అనే నానుడి సమాజములో ఉండేది అంటే అంత తార్కికంగా విమర్శకంగా నిజ నిర్దారణ ఆలోచన చేసే వారు.ఈనాడు ఆ కథల వినుటకే అలవాటు పడ్డారు ఆ తార్కిక జ్ఞానం కొరవడింది.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!