విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్‌వర్క్‌లోకి తేవాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది.
Thank you for reading this post, don't forget to subscribe!రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎ్‌సఎస్) కింద దేశవ్యాప్తంగా 19.79 కోట్ల కనెక్షన్లు, 52.19లక్షల దాకా పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్), 1.88లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్/స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది. మీటర్ల బిగింపు/అమలు ప్రక్రియపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను జారీ చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంత మేర కరెంట్‌ను వాడుతున్నారో ఆ మేరకు అడ్వాన్స్‌గా డిస్కమ్‌లకు చెల్లించి రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ మొత్తం అయిపోగానే వినియోగదారు మొబైల్‌కు మూడుసార్లు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలి.
సదరు వినియోగదారుకు గరిష్ఠంగా రూ.300 క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్‌ను వాడుకునే వెసులుబాటు ఇవ్వాలి. ముందు చెల్లించిన రూ.1000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్ చేసుకునేలా తొలిసందేశం పంపాలి. రీచార్జ్ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్‌గా ఇచ్చిన రూ.200 కరెంట్‌ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి డిస్‌కనెక్ట్(విద్యుత్ సరఫరా నిలిపివేయాలి) చేయాలని కేంద్రం పేర్కొంది.
వినియోగదారుడు మళ్లీ రీచార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించాక మొబైల్‌లో సంబంధిత యాప్ డౌన్‌లోడ్ చేయాలని, వినియోగదారుడు ఈ యాప్ ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవొచ్చని పేర్కొంది. దీని ద్వారా ఇంట్లో లేనప్పుడు మీటర్‌ను ఆఫ్ చేయొచ్చు.
Recent Comments