ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా ఆధ్యక్షులు ఉయిక లక్ష్మీన్ డిమాండ్
రిపబ్లిక్ హిందూస్తాన్, గుడిహత్నూర్: ఈ రోజు ఆదివాసి ప్రజా సంఘాల పిలుపు మేరకు గూడిహత్నుర్ మండల కేంద్రంలో ఆదివాసి సేన ఆధ్వర్యంలో మార్కెట్ ను సంపూర్ణంగా బంద్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సేన జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మీన్ మాట్లాడుతూ జీవో నంబర్ 317 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగుల బదిలీలను వారి స్థానికత ఆధారంగానే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు మా ఉద్యోగాలు, నీళ్లు, వనరులను దోచుకుంటున్నారని చేప్పి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోనల్ బదిలీల పేరుతో ఉద్యోగుల స్థానికతకు ప్రధాన్యతనివ్వకుండ ఇష్ట రీతిన ఉద్యోగులను బదిలీ చేయడానికి ఆయన తప్పుపట్టినారు. ఉద్యోగుల స్థానికత
కోరకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల ఉద్యోగుల స్థానికతను వదిలి ఇతర జిల్లాలకు వెళ్ళటం వలన ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ విధంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టడం కేవలం గిరిజనులకే కాకుండా గిరిజనేతరులకు కూడ తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వం వేంటనే పునరాలోచించి స్థానికతకు ప్రధాన్యతానివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.లేనియెడల దీనిని స్థానికుల జీవన్మరణ పోరాట సమస్యగా భావించి ఈ ఉద్యామని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఆదివాసిల భూమి,ఉనికి, ఆస్తిత్వం, భాష సంస్కృతి సంప్రదాయాలను కాపాడుట కోరకు ఆదివాసిలందరు ఐక్యంగా ఉండి పోరాటం చేయడానికి సిద్ధం కావాలని ఇతర మైదాన ప్రాంతాల నుండి బదిలీలపై వస్తున్న ఉద్యోగులని గో-బ్యాక్ నినాదాలతో వెనక్కి పంపించే కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు పటేల్, రాయి సెంటర్ సార్మేడి కాత్లే భరత్, ఆదివాసి విద్యార్థి సంఘం గూడిహత్నుర్ మండల అధ్యక్షులు మర్సకోల నగేష్, ఆదివాసి విద్యార్థి సేన మండల ఆధ్యక్షులు కుంరం శత్రుఘన్, ఆదివాసి సంఘ నాయకులు ,మేస్రం నాగ్నాథ్ మర్సకోల జైతు, కాత్లే పరసురాం, తోడషం లక్ష్మీన్, కుంరం ఆచ్చంత్ రావు, మేస్రం జంగు, సోయం బోజ్జు, మడావి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments