ఆదివాసి సేన సంఘానికి అత్రం వంశ వారసుల విన్నపం
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, జన్నారం (14 మార్చ్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏజెన్సీ ప్రాంతంలో గల సర్వే నంబర్ 122లో గల భూమి విస్తీర్ణం 631.33 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి లాక్కున్నారని అట్టి భూమిని మాకు ఇప్పించాలని ఆ భూమికి సంబంధించిన పట్టాదారు వారసులు ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి కి విన్నవించారు.ఈ సందర్భంగా ఆదివాసి సేన జన్నారం మండల అధ్యక్షులు దుర్వ యశ్వంత్, ఆదివాసి సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోట్నక గణపతి అధ్వర్యంలో రాత పూర్వకంగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఇట్టి భూమి విషయంలో ప్రభుత్వాధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.ఆ ప్రాంతంలో ఉన్న మా దేవతలకు మేము తరతరాలుగా పూజలు నిర్వహిస్తు వేస్తున్నామని కానీ అటవీ శాఖ అధికారులు మా పూజలకు ఆటంకం కలిగిస్తున్నారని వాపోయారు. తమ సంఘం తరుఫున మా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు వేడుకున్నారు.
వినతి పత్రం ఇచ్చిన వారిలో వారసులతో పాటు ఆదివాసి సేన దుర్వ యశ్వంత్, ఆదివాసి సేన రైతు సేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తోడషం భూమ పటేల్, కుంరం కోటేశ్వర్,రాయిసిడం జంగు పటేల్,అత్రం జలపతి,కుంరం భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments