నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారుల పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి…
ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే స్వయం పాలన ప్రకటిస్తాం..
— ఆదివాసీ సంఘాల నాయకులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల సమస్యను జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని మరియు పంచాయతీరాజ్ విస్తీర్ణ ( పేసా) చట్టం ప్రకారం ఇచ్చోడ గ్రామపంచాయతీ ద్వారా ఇప్పటివరకు ఇచ్చోడాలో ఎన్ని కుటుంబాలకు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చారు..? ఏ ప్రాతిపదికన ఇచ్చారు..? మరియు ఎన్ని కుటుంబాలకు కరెంటు మీటర్ ఇచ్చారు..? ఏ ప్రాతిపదిక ఇచ్చారు … ? ఒకవేళ అధికారులు ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చి వుంటే అది ఏజెన్సీ చట్టాలకు విఘతానికి దారితీస్తుంది కాబట్టి ప్రభుత్వం , అనుమతులు ఇచ్చిన అధికారులు పై చట్టరీత్య చర్యలు తీసుకుని ఈనెల 30.11.2024 వరకు శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
చర్యలు తీసుకొని ఎడల ఏజెన్సీ ప్రాంతం అయిన ఇచ్చోడలో స్వయంపాలన ప్రకటిస్తామనీ అన్నారు. మేము గిరిజనేతరులకు వ్యతిరేకం కాదు, కానీ 1/70 చట్టం తర్వాత వలసవాదం పెరిగి సమస్యలకు దారితీస్తుంది , ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో వలసవాదులకు ఓటు హక్కు రద్దు చేయాలినీ అన్నారు. సమస్య పరిష్కారం కొరకు తేదీ 20.11.2024 న మేడిగూడ రాయి సెంటర్ లో నిర్వహించే సమావేశంలో ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కోడప నగేష్, ఆత్రం మహేందర్ ,మెస్రం శంభు, మడవి భీమ్రావు, కాట్లే విట్టల్ , సంగెం రమేష్ , చాకటి పదాన్ , పెందుర్ రమేష్ , తలండ ప్రభువు, పెందుర్ శంకర్, మెస్రం దేవరావు మరియు వివిధ ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Recent Comments