— సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శనివారం సి సి ఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం స్థానిక తాంసీ బస్ స్టాండ్ ఏరియా నందు మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల అనే అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నేరమని, అలాంటి వాటికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా బాల్య వివాహాలు నిర్వహించడం కూడా నేరమని పిల్లలకు తగినంత వయస్సు వచ్చిన తర్వాతనే వివాహాలు నిర్వహించాలని సూచించారు. ఆడపిల్లలకు సాధ్యమైనంతవరకు చదువును అందించాలని బాల్య వివాహం చేసి తమ బాధ్యతను పూర్తి చేసుకోవాలని చూడకూడదని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కొన్ని పోస్టర్లను ఆవిష్కరించి ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఎస్ఐ సి అశోక్, సిబ్బంది గంగారెడ్డి, దారాట్ల శోభన్, రమేష్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments