Tuesday, October 14, 2025

ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి : జిల్లా ఎస్పీ

  • పోలీసులు మీ కోసంలో భాగంగా నార్నూర్ మండలం కులం గూడా గ్రామంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహణ
  • 8 గ్రామాల ఆదివాసి, కొలాం ప్రజలకు 300 దుప్పట్ల పంపిణీ
  • యువత మంచి చదువులు చదివి, అభివృద్ధి మార్గం వైపు అడుగులు వేయాలి
  • వార్షిక తనిఖీల్లో భాగంగా నార్నూర్ సర్కిల్ కార్యాలయం తనిఖీ
  • ఎటువంటి సహాయం కోసమైనా పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : 
శుక్రవారం నార్నూర్ మండలం ఎంపెళ్లి తండా కోలాంగూడా గ్రామంలో నార్నూర్ పోలీసులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆదివాసి సంప్రదాయాల నడుమ జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద పోలీసులు మీకోసం లో భాగంగా ఆదివాసి కోలాం ప్రజలకు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి 300 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుర్గాపూర్, నార్నూర్ కొలాం, నడ్డుగూడా, భీంపూర్ కొలామ్ గూడా, కొత్తపల్లి, ఎంపెళ్లి కోలామ్ గూడా, గణపతి గూడా, ముక్తాపూర్ కొలాం గూడా అను 8 గ్రామాలకు సంబంధించిన 300 మంది ఆదివాసి గిరిజన కోలాం ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
               ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ముఖ్యంగా యువత చదువుకుని ఉన్నత ఉద్యోగాలను సాధించాలని లేదా వ్యవసాయంలో ఉన్న ఆధునిక పద్ధతులను అవలంబించి ఎక్కువ దిగుబడి పొందేలా వ్యవసాయాన్ని చేయాలని అన్నారు. అందుకుగాను  సంబంధించిన వ్యవసాయ అధికారులతో మాట్లాడి అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. నార్నూర్ మండలంలోని ఆదివాసీ యువత కానిస్టేబుల్ ప్రిలినరీ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారందరికీ స్థానిక డిటిసి నందు ఉచితంగా శారీరక మరియు తుది పరీక్ష కోసం శిక్షణను త్వరలో అందించినట్లు తెలియజేశారు.



ఈ మధ్యలో విడుదలైన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష నందు 159 అభ్యర్థులు స్థానిక డిటిసిలో పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న వారు ఉత్తీర్ణులైనరని తెలియజేశారు. యువత ఖాళీగా ఉండకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కానీ, ప్రైవేటు ఉద్యోగం కోసం గాని, వ్యవసాయంలో గాని, ఉపాధిని సంబంధించి ఎటువంటి వాటిలోనైనా రాణించి సమాజంలో ఆదివాసి ప్రజలను, తమ గూడాలను అభివృద్ధి వైపు పయనించేలా కృషి చేయాలని తెలియజేశారు. ప్రతినెల నార్నూర్ మండలంలో గాని, గాదిగూడ మండలంలో గాని పోలీసులు మీకోసం లో భాగంగా ఏదైనా సమాజాహిత కార్యక్రమాలను నిర్వహించి ఆదివాసీలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని తెలియజేశారు. త్వరలో నిర్వహించబోయే మెడికల్ క్యాంపు ను అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని తెలియజేశారు. ఆదివాసీలు, మారుమూల గిరిజన గ్రామ ప్రజలకు సరైన కాలంలో దుప్పట్లను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.

ఫొటో : కార్యక్రమంలో దుప్పట్లు పంపిణి చేస్తున్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

Thank you for reading this post, don't forget to subscribe!
ఆ తరువాత వార్షిక తనిఖీల్లో భాగంగా నార్నూర్ సర్కిల్ ఆఫీస్ ను తనిఖీ చేశారు. మొదటగా నార్నూర్ పోలీసులు ద్వారా ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి, పరిసరాలను పరిశీలించి, స్టేషన్ పరిసరాలలో ఒక మొక్కను నాటి సిబ్బందితో మాట్లాడారు. తదుపరి సర్కిల్ ఆఫీసులో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిఐ ప్రేమ్ కుమార్ తో చేయవలసిన కార్యచరణను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ సిఐ ప్రేమ్ కుమార్, గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్, సర్పంచ్ కనక ప్రభాకర్ ,సర్పంచ్ రాథోడ్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!