హైదరాబాద్ : ఆఫ్రికాలోని అక్రా రాజధాని ఘనాలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. సైనిక హెలికాప్టర్ కుప్పకూలడం వల్ల ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్యాబినెట్ మంత్రుల తో పాటు మరో ఆరుగురు.. మొత్తంగా ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో ఘనా దేశ డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఒమానే బోమాతో పాటుగా ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్ ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది.
బుధవారం ఉదయం జెడ్-9 యుటిలిటీ సైనిక హెలికాప్టర్ ఘనా రాజధాని అక్ర నుంచి ఒబువాసికి చేరుకోవడానికి ప్రయాణం మొదలు పెట్టింది. అయితే హెలికాప్టర్ గాల్లోకి టేకాఫ్ అయిన కాసేపటికే అది ఏటీసీతో కమ్యూనికేషన్ కోల్పోయి కుప్ప కూలింది.
హెలికాప్టర్ కుప్ప కూలిన సమయంలో దానిలో ఇద్దరు కేబినెట్ మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ధాటికి హెలికాప్టర్‌లో ప్రయాణం చేస్తున్న వారంతా చనిపోయారని ఘనా దేశం ప్రకటించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నా యి. యుద్ధప్రాతిపదిక సహయక చర్యలు మొదలుపెట్టాయి. మృతదేహాలను వెలికి తీసి.. ఆస్పత్రికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
హెలికాప్టర్ కుప్ప కూలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని.. నిపుణుల బృందం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణం గానే హెలికాప్టర్ కుప్పకూలి నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘన ప్రభుత్వం హెలికాప్టర్ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా ప్రకటించింది.
దశాబ్ద కాలంలో ఘనాలో చోటు చేసుకున్న అత్యంత భయానక విమాన ప్రమాదాలలో ఇదొకటని అధికారులు తెలిపారు. 2014లో తీరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మరణించగా.. 2021లో రాజధాని అక్రాలో ఒక కార్గో విమానం రన్‌వేను దాటి ప్రయాణీకుల బస్సును ఢీకొట్టడంతో 10 మంది మరణించారని వెల్లడించారు. ఇక తాజాగా సైనిక హెలికాప్టర్ కూలి ఇద్దరు కేంద్ర మంత్రులు సహా మొత్తం 8 మంది చనిపోయారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments