ePaper
Wednesday, March 11, 2026
📄 ePaper

ఒక్కో కాలికి రెండు వేళ్లు మాత్రమే

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

పార్వతీపురంలో వింత పాదాలతో శిశువు జన్మించింది. సాధారణంగా కాళ్లు, చేతులకు ఐదు వేళ్లతో పిల్లలు జన్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్కో కాలుకు రెండు వేళ్లు మాత్రమే ఉన్నాయి.

బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన ఓ గర్భిణి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవంలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. శిశువు రెండు కాళ్లకు రెండేసి చొప్పున మాత్రమే వేళ్లతో పాటు వాటి మధ్య ఎక్కువ ఖాళీ ఉండటంతో పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. జన్యుపరమైన లోపాలతో ఇలా జరిగి ఉండొచ్చని చిన్న పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని.. అయితే ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని తెలిపారు. అయితే ఒక్కో కాలుకు రెండు వేళ్లు మాత్రమే ఉండటంతో నడవటానికి సమస్యలు ఏవైనా వస్తాయా అనేది చూడాలంటున్నారు డాక్టర్లు. ఈ శిశువు గురించి స్థానికంగా చర్చించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!