కళ్లు లేకుండా శిశువు జన్మించడం అంటే మాములుగా కొద్దిమందిలో జరిగేదేగా అనేకోకండి. ఎందుకుంటే కళ్లే ఏర్పడకుండా పుట్టడం వేరు. కళ్లు లేకపోవడం వేరు. అంటే..చూపు కనిపించని అంధులకైనా కంటి నిర్మాణం ఉంటుంది. కాకపోతే దృష్టి లోపం ఉంటుంది. అసలు కంటి స్థానంలో కణజాలం లేదా ఆప్టికల్ నరాలే లేకుండా పుడితే వారిని కళ్లే ఏర్పడకుండా జన్మించిన శిశువు అంటాం. ఈ పరిస్థితి అరుదైనా జన్యు సమస్య కారణంగా ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మంది దాక ఉన్నారట. అలాంటి చిన్నారే యూఎస్‌లోని మిస్సౌరీలో ఓ ప్రవేటు ఆస్పత్రిలో జన్మించాడు.
ఆ చిన్నారి పేరు రెన్లీ. ఆ శిశువు పుట్టుకతో అనోఫ్తాల్మియాతో జన్మించాడు. అందువల్ల ఆ చిన్నారికి కంటి కణజాలం లేదా ఆప్టిక్ నరాలు ఉండని ఒక విధమైన జన్యు పరిస్థితి అని చెప్పారు వైద్యులు. ఈ మేరకు సదరు చిన్నారి తల్లి మాట్లాడుతూ..సిజేరియన్ ద్వారా జన్మించిన తన చిన్నారి రోగ నిర్థారణ కోసం తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలోనే వేచి ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యింది. చివరికి వైద్యలు కార్టిసాల్ లేకుండానే జన్మించాడని, అందువల్లే కళ్లు మూసుకుపోయాయని చెప్పారని తెలిపింది. ఇది చాలా అరుదైన పరిస్థితి అని, ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అలాగే ఇదే జన్యు మార్పు కొంతమందికి ఒక కన్ను మాత్రమే ప్రభావితమవుతుందని, కానీ చిన్నారి రెన్లీ విషయంలో అందుకు విరుద్ధంగా రెండు కళ్లు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితి అతడి మేథస్సును, శారిరీక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రెన్లీకి భవిష్యత్తులో వచ్చే తన పిల్లలకు కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం 50 శాతం ఉందని తేల్చి చెప్పారు వైద్యులు.
ప్రస్తుతం రెన్లీకి కళ్లుని తెప్పించే చికిత్సలు ఏమీ లేనప్పటికీ కంటి సాకెట్ల చుట్టూ ఎముక, మృదు కణజాల పెరుగుదలకు సహాయపడటానికి ప్రొస్టెటిక్ కళ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్ది వారాల్లో రెన్లీకి కృత్రిమ కళ్లు అమర్చడానికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలిపారు వైద్యులు.
అనోఫ్తాల్మియాకు కారణం..
ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు..
⇒ ప్రీ మెచ్చూర్ కంటి శుక్లం: కంటిపై మేఘావృతమైన ఫిల్మ్ కలిగి మబ్బుగా ఉంటుంది. దృష్టి బలహీనమై రంగులను గుర్తించడానికి కష్టమవుతుంది.
⇒ కోలోబోమా
కణాజాలం కనిపించకుండా పోతుంది. ఎక్కువగా కనుపాపలో జరుగుతుంది.
⇒ వేరు చేసిన రెటీనా
ఇది పూర్తి అంధత్వానికి దారితీసే పరిస్థితి
⇒ ప్టోసిస్
ప్టోసిస్ లేదా సైడోప్టోసిస్, అనేది కండరాలు, నరాలు ఉన్నప్పటికీ పడిపోతున్న కనురెప్పను సూచిస్తుంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments