హైదరాబాద్/రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో మోసపోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తికి ‘సాటా’ (SATA) రియాద్ విభాగం అండగా నిలిచింది.
ఈ విషయం తెలుసుకున్న సాటా రియాద్ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ పిలుపు మేరకు, తక్షణ అవసరాల నిమిత్తం అక్బర్‌కు కొంత ఆర్థిక సహాయం అందించారు. దీంతో పాటు నల్గొండ జిల్లా వాసులు కూడా స్పందించి నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు.
అక్బర్ నివసిస్తున్న ప్రాంతంలో అందుబాటులో ఉన్న సాటా కోర్ టీమ్ సభ్యులు ముదిగొండ శంకర్ ఆధ్వర్యంలో మహ్మద్ నూరుద్దీన్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, దూడం సంజీవ్, మహమ్మద్ లూకమాన్, పళ్ళికొండ సంజీవ్ తదితరులు అతడిని కలిసి పరామర్శించారు. అక్బర్ సమస్యను భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని, అతడిని సురక్షితంగా భారతదేశానికి పంపించే వరకు తోడుగా ఉంటామని వారు ధైర్యం చెప్పారు.
ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని సాటా ఫౌండర్ మల్లేశన్, సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చతో పాటు కోర్ టీం సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, సింగూ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీ చరణ్, మహమ్మద్ కమిల్ తదితరులు అభినందనలు తెలియజేశారు.
Recent Comments