హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల (BC) రిజర్వేషన్‌ను 42 శాతం వరకు పెంచుతూ జీవో (G.O. Ms. No.9) విడుదల చేసింది.
ఈ నిర్ణయం ప్రకారం గ్రామపంచాయతీలు, మండల పరిషత్, జడ్పీటీసీ, వార్డులు వంటి అన్ని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించి బీసీ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. తాజాగా నిర్వహించిన సామాజిక-ఆర్థిక-విద్యా-ఉద్యోగ సర్వే ఆధారంగా బీసీ జనాభా 56.33 శాతం ఉందని గుర్తించిన కమిషన్, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సూచించింది.Hyderabad: The Telangana government took a key decision today. It has issued G.O. Ms. No.9 increasing the reservation for Backward Classes (BC) in local bodies to 42 percent.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టు 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రిజర్వేషన్లపై స్పష్టత కోసం ఈ జీవో జారీ చేయబడింది.
అయితే రిజర్వేషన్ పరిమితి 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం రాజ్యాంగపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్ర గవర్నర్ అనుమతి పొంది, ప్రెసిడెంట్ ఆమోదం కోసం వెళ్లాయి.
మొత్తం మీద, బీసీలకు గరిష్ట ప్రాతినిధ్యం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ జీవో ఒక పెద్ద అడుగుగా భావించబడుతోంది.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ – ప్రభుత్వం జీవో జారీ
RELATED ARTICLES
Recent Comments