హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా సేవాలాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ ఉమేష్ జాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లాల అధ్యక్షులు, సంఘంలోని సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని మరింత బాధ్యతతో నిర్వర్తిస్తానని, నిబద్ధతతో, కృషితో, సమర్థతతో పనిచేస్తానని సేవాలాల్ నాయక్ స్పష్టం చేశారు. అలాగే సంఘ బలోపేతం కోసం అందరి ఆశీర్వాదాలు, సహకారం కోరుతూ కృతజ్ఞతలు తెలిపారు.
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా సేవాలాల్ నాయక్ నియామకం
RELATED ARTICLES
Recent Comments