Monday, October 13, 2025

సౌదీ అరేబియాలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు



రియాద్  : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్  జన్మదిన వేడుకలు గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో, రియాద్ జనసేన అధ్యక్షుడు మురారి తాటికాయల నాయకత్వంలో తెలుగు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ వేడుకలో జనసేన ప్రముఖులు  ఉష, గురుకిరణ్, శ్రీనివాస్ రావూరి, సీతారామ్, యాకుబ్ ఖాన్, ఆనందరాజు, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జనసైనికులు, వీరమహిళలు, మెగా అభిమానులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ వేడుకను విజయవంతం చేశారు.

Thank you for reading this post, don't forget to subscribe!


ఈ సందర్భంగా ఇండియా నుండి జనసేన సౌదీ అరేబియా రీజినల్ కన్వీనర్ అమీర్ ఖాన్ తన సందేశం పంపుతూ, మురారి తాటికాయల నాయకత్వం మరియు కొత్త కార్యవర్గం సహకారంతో NRI జనసేన మరింత బలపడుతుందని తెలిపారు.

ప్రత్యేక ఆహ్వానంపై SATA రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ పిలుపుమేరకు SATA కోర్ టీమ్ సభ్యులు మహమ్మద్ నూరుద్దీన్, మిధున సురేష్, అస్లాం, లోకేష్ తాళ్ల, కోకిల ఒతులూరి, ముదిగొండ శంకర్, సింగు నరేష్, యోగేష్, షాహాబాజ్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోకిల ఒతులూరి తన గానంతో అందరిని అలరించారు.

అలాగే ప్రత్యేక ఆహ్వానంతో TASA Founder స్వామి స్వర్ణ, రియాద్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర వాకాటి, TASA సభ్యులు అనిల్ మర్రి, ఇబ్రహీం షేక్, నటరాజ్, అజయ్ రావూరి, సాయి తదితరులు పాల్గొన్నారు.

ఈ రెండు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ – తెలుగు వారందరం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ ముందుకు సాగాలని, ఎల్లప్పుడూ తెలుగు ప్రజలకు సహకరించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. అలాగే జనసేన కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ, తమ సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

చివరగా రియాద్ జనసేన అధ్యక్షుడు మురారి తాటికాయల మాట్లాడుతూ – పవన్ కళ్యాణ్  ఆశయాల ప్రకారం కుల, మత ప్రస్తావనలేని రాజకీయాల కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. NRI తెలుగు ప్రజలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!