హైదరాబాద్,ఆగస్టు 28 :
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి,ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బుధవారం కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది,నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
వరదల ప్రభావిత మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. ఆయా జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, మన్యం, కోనసీమ, ఉభయ గోదా వరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
కాగా, పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ఆ ప్రాజెక్టు నుంచి 3.8 లక్షల క్యూసెక్కుల వర ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం ఉంది. మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు
కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్
కాచిగూడ-మెదక్, మెదక్- కాచిగూడ, బోధన్- కాచిగూడ..ఆదిలాబాద్- తిరుపతి రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే నిజామాబాద్- కాచిగూడ రైలు సర్వీస్ ను రద్దు చేసింది మహబూబ్ నగర్ -కాచిగడ
షాద్‌నగర్ కాచిగూడ సర్వీసును కూడా పాక్షికంగా రద్దు చేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments