– రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలి
– విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
– ప్రభుత్వ విద్యా సంస్థలకు స్వంత భవనాలు నిర్వహించాలి
– బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ జక్కనపల్లి గణేష్
కరీంనగర్ : పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బిఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ జక్కనపల్లి గణేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న ప్రభుత్వ విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ సీట్ అందించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ఖాళీలు అన్నింటిని భర్తీ చేయాలన్నారు. పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టల్స్ లలో మెస్ మెనూ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామన్నారు.
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
RELATED ARTICLES
Recent Comments