Tuesday, October 14, 2025

సౌదీ కు వచ్చిన సంక్రాంతి… సాటా ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు

సంక్రాంతి శోభ సౌదీని క‌న్నుల పండ‌వ‌గా అలంక‌రించింది. సౌదీ అరేబియాలోని తెలుగు వారందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా సౌదీ తెలుగు అసోసియేషన్ (సాటా) నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.

Thank you for reading this post, don't forget to subscribe!

ఈ సంబరాల్లో విజయ, దివ్య, గౌరి, సూర్య లాంటి ప్రతిభావంతుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరినీ మైమరిపించాయి. మ్యూజిక్, లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా రాకేష్, రామ్, కృష్ణ, పర్దు అందించిన ప్రదర్శన కార్యక్రమానికి మరింత అందం చేకూర్చింది.



అందమైన డెకరేషన్లతో ప్రాంగణాన్ని ముస్తాబు చేసిన సురేష్, రాధా, సతీష్, సుబ్బు, విశాల్, సోవ్య, జయశ్రీ వంటి వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. నోరూరించే వంటకాలు అందించిన తరక్, జగదీష్, రవి, రాంబాబు వారి నైపుణ్యాన్ని చూపించారు.

భరత్, కాయల, శ్రీనివాస్, సంతోషి లక్కీ డ్రా మరియు గిఫ్ట్ కార్యకలాపాలు నిర్వహించి అందరికీ ఆనందాన్ని అందించారు. రిజిస్ట్రేషన్, కలెక్షన్, స్వాగత టీంలో పనిచేసిన జగన్, రాజేష్, వరప్రసాద్, శ్రీనివాస్, జగదీష్, సూర్య, సురేష్ నాయుడు, శ్రీరామ్, దిలీప్, రామిరెడ్డి వంటి సభ్యుల కృషి పట్ల ప్రతి ఒక్కరూ అభినందన తెలిపారు.



సాటా అధ్యక్షుడు తేజ, సాటా వ్యవస్థాపకుడు మల్లేశం మాట్లాడుతూ, ఈ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వారు ప్రత్యేకంగా యాంక‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గౌరి, శిల్ప, శైలజ, తరక్, ప్రవీణను అభినందించారు. రంగోలి టీం సభ్యులు నవ్య, సోజన్యల సహకారం గుర్తుచేశారు.



సంక్రాంతి అంటే సాటా సంక్రాంతి అనే పేరు మరోసారి సార్థకత సాధించింది. ఈ విజయానికి కారణమైన కోర్ మరియు ఆర్గనైజింగ్ టీంను సాటా ప్రత్యేకంగా అభినందించింది. మిత్రుల సహకారంతో ఈ హ్యాట్రిక్ విజయాన్ని సాధించామని వారు పేర్కొన్నారు.



**సాటా సంక్రాంతి – ఉత్సాహ భరిత వేడుకలకు మరో గుర్తింపు!**

#saudi arabia #sankranti festivel

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!