వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఇద్దరు పిల్లలను అనాధలు చేసి ఆత్మహత్య చేసుకున్న భార్య, భర్త
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు.. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు..వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12).
గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి.. ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు.
అయితే కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. దీనికి ప్రతి వారం రూ. 200 కిస్తీ కట్టాల్సి ఉంటుంది.
కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా.. భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో చందన కొన్నాళ్లుగా చందన కిస్తీలు కట్టలేకపోయింది.
దీనిపై ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురైన చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా.. ఇరుగుపొరుగువారు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మంగళవారం మృతిచెందింది.
ఆదిలాబాద్ జిల్లా లో జోరు మీద ప్రైవేట్ ఫైనాన్స్ దందా… అధికారుల అండదండ…!
ఈ రకమైన వడ్డీ వ్యాపారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంతో పాటు అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో జరుగుతున్న అధికారులకు నెల నెలా మామూలు అందడంతో వారి పై కరుణ చూపి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అయ్యే బాధ్యతను అధికారులు భుజాన వేసుకున్నట్లున్నారు.
ఫైనాన్స్ వ్యాపారుల వల్ల ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తరువాత అన్ని విషయాలు ” మామూలు ‘ అయినవెంటనే మళ్ళీ వ్యాపారం మొదలైన వాటి పై ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఇలాంటి సంఘటనలు , ఇలా ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉంటాయి.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments