రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్: జిల్లాలో పులి సంచరించడం.. ఆవులపై దాడి చేయడం.. బోథ్ నియోజకవర్గంలోని చిరుత ఆవులపై దాడితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం ఏకంగా చిరుత ఒక మహిళ పైన దాడి చేయడంతో ప్రజలు భయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే…

బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన అర్కా భీమాబాయి బహిరభూమికి వెళ్లిన సమయంలో చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో మహిళకు గాయాలవ్వడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. మహిళపై చిరుత దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దాడి చేసిన ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పులి దాడిలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
Recent Comments