Saturday, August 30, 2025

అక్రమ ఇసుక రవాణా కట్టడిలో విఫలమైన 3 CI లు, 13 మంది SI లపై వేటు

బాలిక పై జరిగిన రేప్ కేసులో అలసత్వమూ మారియు దర్యాప్తులో  అవకతవకలకు పాల్పడిన సిఐ సస్పెండ్..

Thank you for reading this post, don't forget to subscribe!



హైదారాబాద్ :    మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన 3 CI లు, 13 మంది SI లను VR లో పెడుతూ మల్టీజోన్-2 IGP శ్రీ వి. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ విషయంలో ఇప్పటికే 1 CI మరియు 14 మంది SI లను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం VR లో పెట్టిన వాళ్ళలో సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్,  తాండూరు టౌన్ CI లతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి,  వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి,  ఆత్మకూర్(S), పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా, SI లను VR లో పెట్టారు. వీరిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్ష మరియు పరోక్ష సహకారం ఉండటంతో వారిపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలో వీరిని లూప్ లైన్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు మరియు ఇతర ఎంక్వయిరీల ద్వారా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది.ఇప్పటికే అడవిదేవీపల్లి, వేములపల్లి, నార్కట్ పల్లి, చండూర్, మాడుగుల పల్లి, తిప్పర్తి, చింతలపాలెం,  తిరుమలగిరి,  నాగారం,  జాజిరెడ్డిగూడెం,  అచ్చంపేట్,  బొంరాస్ పేట్, తాండూర్,  చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది.  అదేవిధంగా వాగులలో మరియు నిషేధిత నది ప్రాంతాలలో ఎక్కడబడితే అక్కడ విచక్షణ రహితంగా ఇసుకను తవ్వితే పర్యావరణ సమతుల్యానికి భంగం వాటిల్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, రాష్ట్ర DGP ఈ విషయంలో సీరియస్ గా ఉండడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత అధికారులు భాధ్యత వహించాలి.
              కొండమల్లేపల్లి హోంగార్డు 947, జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ 1049 అక్రమ ఇసుక రవాణాలో వసూళ్లు చేయడం వల్ల వాళ్ళను సంబంధిత DAR కు అటాచ్ చేయడం జరిగింది. తదుపరి చర్యలు PDS రైస్ అక్రమ రవాణా మీద ఉంటుంది. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతున్నది. PDS రైస్ అక్రమ రవాణాలో స్థానికంగా చేసేవారు కాకుండా, ముఖ్యంగా అంతర్రాష్ట్రంగా చేసే ప్రధాన నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని SP లను IG గారు ఆదేశించారు.
              
            
             PDS రైస్ అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా,  గాంబ్లింగ్ మరియు మట్కా పూర్తిగా బంద్ కావాల్సిందే. గాంబ్లింగ్ మరియు మట్కా జరిగితే సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే వికారాబాద్ లోని మర్పల్లిలో గెస్ట్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్న ప్రభాకర్ సేట్ మరియు రఫిక్ లను SP వికారాబాద్ తో పాటు IGP మల్టీజోన్ -2 స్వయంగా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రఫీ మీద Suspect Sheet ఓపెన్ చేయడం జరిగింది. పేద, మధ్య తరగతి వ్యక్తుల నుండి దోపిడి చేసే ఈ గాంబ్లింగ్ పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మల్టీజోన్-2 లో గాంబ్లింగ్ వాసనే రాకూడదు. జిల్లాల్లో ఎక్కడ కూడా గాంబ్లింగ్ జరగకుండా చూసే బాధ్యత 9 జిల్లాల SP లదే అని IG గారు చెప్పారు. 
  
వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్….

        బాధ్యతాయుతమైన సర్కీల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ ఒక మైనర్ బాలిక పై జరిగిన రేప్ కేసు లో అలసత్వమూ మారియు దర్యాప్తులో  అవకతవకలకు పాలుపడినందున ఎ. నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జోగిపేట ప్రస్తుతం స్టేషన్ హౌస్ ఆఫీసర్, వికారాబాద్ టౌన్ పీఎస్ గా పనిచేస్తున్న అధికారిని శ్రీ వి సత్యనారాయణ, ఐపీఎస్, మల్టీ జోన్-2  విధుల నుండి సస్పెండ్ చేశారు.

V. Satyanarayana, IPS, IGP, Multi Zone- II, Hyderabad.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి