హైదరాబాద్: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో విలన్‌గా వినాయకన్ పాపులర్ అయ్యారు. అయితే. ఈయనకు సినిమాల్లో విలన్ వేషాలతో మంచి పేరు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ అతను విలన్ చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గత ఏడాది కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అతని ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
శనివారం రోజు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వినాయకన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ని కొట్టినట్లు ఆర్జీఐ పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వినాయకన్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు సీఐఎస్ఎఫ్ పోలీసులు ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినాయకన్‌ను అదుపులోకి తీసుకొని ఆర్జీఐ పోలీసులకు సీఐఎస్ఎఫ్ పోలీసులు అప్పగించారు.
మద్యం మత్తులో ఉండి తమపై దాడి చేశారని సీఐఎస్ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేశారు గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన కూడా అతని దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కొచ్చిన్‌లో సినిమా షూట్ంగ్ ముగించుకుని గోవా కనెక్ట్ంగ్ ఫ్లైట్ కోసం వినాయకన్ వెయిటింగ్ ఛేస్తున్నాడు.
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వెయిటింగ్లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి అతను గోవాలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకొని ఆర్జీఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి మారిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
Recent Comments