నలుగురికి తీవ్ర గాయాలు
కామారెడ్డి జిల్లా :
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ – వర్ని ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు..
నసురుల్లాబాద్ ఏఎస్ఐ పటేల్ వెంకట్ రావు తెలిపిన వివరాల మేరకు… నాందేడ్ జిల్లా విష్ణుపూరికి చెందిన వారు బాన్సువాడకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆటోలో వస్తుండగా పిట్లం నుంచి మేకల లోడ్ తో బోధన్ వైపు వెల్లుతున్న బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది.
దీంతో ఆటోలో వస్తున్న ఫాంచాలి ఉష (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నాందేడ్ కు చెందిన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Recent Comments