ఆంధ్రప్రదేశ్ తిరుపతి : తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ధూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు.
ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం,
తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం,
యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం,
గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి.
ఇది జీవనది కాదు.
సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.
ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.
ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.
స్వర్ణముఖి నది పాకాల సమాంలో ఉన్న పాలకొండ లలో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టినది.
ఇది చంద్రగిరి ఎగువన భీమానదితో సంగమించి నది అయింది.
ఆతరువాత దిగువన ఉన్న కల్యాణీనదితో కలిసి పెద్దనదిగా మారింది. చంద్రగిరి వద్ద ఉన్న చంద్రనగము, హేమనగములలో ఇది హేమనగాన్ని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఇది సార్థక నామాధేయురాలైంది. వాస్తవానికి స్వర్ణముఖరీ ఇసుక వెండిలా తెల్లగానూ అలాగే సువర్ణంలో బంగారు వర్ణంతోనూ ఉంటుంది. తరువాత ఈ నది కొంతదూరం ఉత్తరంగా ప్రవహించి మరికొంత దూరం ఈశాన్యంగా ప్రవహిస్తు శేషాచల కొండలను స్పృజించి కల్యాణీ, భిమానదులతో సంగమించి కపిలతీర్ధం, అలివేలుమంగాపురం, శ్రీకాళహస్తి, నెల్లూరు మీదుగా ప్రవహించి నూడుపేట సమీపంలో ఉన్న సిద్ధవరం వద్ద తూర్పుసముద్రంలో సంగమిస్తుంది.
స్వర్ణముఖీ నదీ తీరంలో అగశ్వేరాలయం, వరేశ్వరాలయం,
పద్మావతీ దేవి ఆలయం, పరశురామేశ్వరాలయం ఉన్నాయి.
ఈ నది మొత్తంగా దాదాపు 100 మైళ్ళు ప్రయాణిస్తుంది.
సువర్ణముఖి నది అగస్త్యుని తపోభంగం కలిగించగా అగద్త్యుడు స్వర్ణముఖినీ నదిని శపించాడు. అందువలన నదిలో నీరు ఇంకిపోయింది. అయినప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న కారణంగా నదీసమీపంలో ఉన్న బావులలో నీరు ఇంకిపోదు. నదీతీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా స్వర్ణముఖీ నదికి ” మొగలేరు ” అనే మరొకపేరు కూడా వచ్చింది. ఈ నదికి పలు వాగులు, వంకలు, ఏరులూ జలాలను ఆందిస్తున్నాయి. వాటిలో కల్యాణీ, భీమానదులు ప్రధానమైనవి. కల్యాణీ నదీతీరంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణశ్రీనివాసుడు వెలసి పూజలందుకుంటున్నాడు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments