పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : రాష్ర్ట రాజధాని లో మాజీ సర్పంచుల సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మరియు పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసన కార్యక్రమం చెప్పట్టారు. అదేవిధంగా సర్పంచుల సమస్యలు పరిష్కారం చేయకుండానే ఎన్నికలు నిర్వహించాలని చూడడం సరికాదని , వెంటనే ఎన్నికల ప్రక్రియ ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఎటు చూసిన దోపిడీ రాజ్యం నడుస్తునంది విమర్శించారు. నిరసన చేపట్టే అసెంబ్లీ వైపుకు వెళుతున్నారని పసిగట్టిన పోలీసులు ముందస్తుగా నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ కూడా వారి నిరసన కార్యక్రమం కొనసాగింది.
ఈ నిరసనలో సర్పంచుల సంఘం ఐక్యవేదిక ఆదిలాబాద్ అధ్యక్షుడు మరియు ఎంపి పోటీ దారుడు సుభాష్ రాథోడ్ మరియు వివిధ జిల్లాల సర్పంచ్లు పాల్గొన్నారు.
Recent Comments