సిరిసిల్ల జిల్లా:ఏప్రిల్ 08
అల్లారుముద్దుగా పెంచు కున్న కూతురును ఉన్నత చదువులు చదివిస్తే.. చివరికి అమ్మనాన్నలను కాదని ప్రేమించినోడితో వెళ్లిపోయింది.
బాగా చదువుకున్నోడు, రూ.లక్షల్లో జీతం వచ్చే అబ్బాయిని కూతరుకు కట్టబెట్టి ఆమె మంచి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని అనుకున్న ఆ కన్నతండ్రికి కడుపుకోతే మిగిలింది.
వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోని చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష బీ.టెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే కాలేజీలో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది.
ఏకంగా తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించినోడినే పెళ్లి చేసుకుంది. వేల ఆశలతో కూతురు పెళ్లిని ఘనంగా చేయాలని భావించిన ఆ తల్లిదండ్రు లకు నిరాశే ఎదురైంది.
తమను కాదనుకుని వెళ్లి పోయిన కూతురు తలుచు కుని తండ్రి మురళి బోరున విలపించాడు. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుం దని. ఇక నుంచి తన కూతురు చనిపోయిం దంటూ ఇంటి ఎదుటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపాడు.
ఈ పరిణామంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు, బంధు వులు ఆ తండ్రి ఆవేదన చూసి బోరున విలపించారు. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదంటూ కన్నీరు మున్నీరు అయ్యారు…
Recent Comments