Mar 12, 2024,
అల్వాల్ లో ల్యాబ్ టెక్నీషియన్ అనుమానాస్పద మృతి
హైదరబాద్ లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అల్వాల్ లో నివాసం ఉంటున్న రాము నాయక్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. మంగళవారం అతను చనిపోయినట్లు నగర్ కర్నూల్ లో ఉన్న కుటుంబీకులకు ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రికి చేరుకున్న బంధువులు రాము మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Recent Comments