epaper
Saturday, January 24, 2026

కాసులు కురిపించే ప్రభుత్వ పథకం.. ప్రతి నెల రూ. 10 వేల వరకు అకౌంట్‌లో జమ!

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

నేటి రోజుల్లో సంపాదన కంటే ఖర్చులే ఎక్కువైపోతున్నాయి. పెరుగుతున్న నిత్యావసరవస్తువుల ధరలు, ఇంటి ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకునేందుకు కొంత మంది ఉద్యోగాలు చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

ప్రతి నెల అదనపు ఆదాయం ఉంటే బాగుండు అని ఎవరు కోరుకోరు. అయితే ఇలాంటి వారికోసం ప్రతి నెల కాసులు కురిపించే ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే నెలకు ఖచ్చితమైన రాబడి ఉంటుంది. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే నెల నెల మీ అకౌంట్ లో రూ. 10 వేల వరకు జమ అవుతుంది. ఆ పథకమే పోస్టాఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్.

ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ అద్భుతమైన ప్రయోజనాలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతోంది. పెట్టుబడిపై అధిక వడ్డీని అందిస్తూ మంచి రాబడులను అందిస్తోంది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లకంటే పోస్టాఫీసుల్లోనే ఎక్కువ వడ్డీ వస్తుండడంతో పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్టుబడి సురక్షితంగా ఉండడంతో పాటు గ్యారంటీ రిటర్న్స్ వస్తుండడంతో పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ పై మొగ్గు చూపుతున్నారు. అయితే మీరు ప్రతినెల రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ పథకంలో డిపాజిట్ చేసిన మీ అమౌంట్ కు ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ చొప్పున నెల నెల వడ్డీ డబ్బులను డ్రా చేసుకోవచ్చు. ఈ వడ్డీ రేటు అనేది త్రైమాసికానికి(మూడునెలలు) ఒక సారి మారుతుంటుంది.

పోస్టాఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంపై నెల నెలా వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. డిపాజిట్ చేసిన తేదీ తర్వాతి నెల నుంచి మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు ప్రతీనెలా మీ పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో వడ్డీ రూపంలో రాబడి జమ అవుతుంది. ఖాతా మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలుగా ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.9లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

ఒక వేళ జాయింట్ అకౌంట్ అయితే.. రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో మీరు రూ.9లక్షల వరకు డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.5,550 పొందవచ్చు. ఇక రూ.15లక్షలకు అయితే.. రూ.9,250 బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. డిపాజిట్ చేసిన సంవత్సరంలోగా ఖాతాను క్లోజ్ చేసే అవకాశం ఉండదు. ఖాతా మెచ్యూరిటీ తర్వాత మీరు పెట్టిన పెట్టుబడిని తీసుకోవచ్చు. ప్రతి నెల రాబడి కావాలనుకునే వారు పోస్టాఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీం లో పెట్టుబడి పెడితే లాభాలు పొందొచ్చంటున్నారు నిపుణులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!