స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ లావాదేవీల ధృవీకరణ కోసం చాలకాలంగా వినియోగంలో ఉన్న ఓటీపీ (One Time Password) విధానం మరుగున పడనుందా?.. ఓటీపీ స్థానంలో మరో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుందా?
Thank you for reading this post, don't forget to subscribe!ఇందుకోసం కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కసరత్తు సిద్ధం చేస్తోందా?.. అంటే ఔననే సమాధానమిస్తున్నాయి రిపోర్టులు. డిజిటల్ చెల్లింపుల ధృవీకరణకు ఓటీపీలు ఉపయోగపడుతున్నప్పటికీ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. దీంతో ఈ విధానానికి చెక్ పెట్టాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ భావిస్తోంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఓటీపీల స్థానంలో అథెంటికేషన్ యాప్‌లు, బయోమెట్రిక్ సెన్సార్‌లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపులను మరింత భద్రంగా మార్చచడమే లక్ష్యంగా ఈ దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. ఈ నూతన విధానం ద్వారా సిమ్ స్వాపింగ్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై హ్యాకర్ల గురిపెట్టకుండా నిరోధించడమే లక్ష్యంగా ఆర్బీఐ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తే డిజిటల్ చెల్లింపులు మరింత భద్రంగా ఉంటాయని భావిస్తోంది.
సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా ఎక్స్ (గతంలో ట్విటర్) వంటి పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే ఎస్ఎంఎస్ ఆధారిత వేరికేషన్ నుంచి అథెంటికేషన్ యాప్‌లకు మారాయి. దీంతో యూపీఐ చెల్లింపుల విషయంలో కూడా ఇలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆర్బీఐ యోచిస్తోంది.
అయితే ఓటీపీ సిస్టమ్ నుంచి అథెంటికేషన్ యాప్‌లకు మారే విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా యాప్స్ సపోర్ట్ లేని ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి వినియోగదారులు అందరూ కొత్త వ్యవస్థలోకి మారే విషయంలో ఆర్బీఐ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో చూడాలి.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments