కరోనా మహమ్మారి తరువాత రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందింది. గత కొంతకాలం నుంచి ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి.
Thank you for reading this post, don't forget to subscribe!ఇండియాలోనే ఇలా ఉంటే.. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో రియల్ ఎస్టేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల USAలో ప్లాట్ ఏకంగా రూ.200 కోట్లకు పలికినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికాలోని చాలామంది ధనవంతులు ప్లోరిడాలోని మయామీ బీచ్ దగ్గర ఇల్లు కట్టుకోవాలని కలలు కంటారు. ఇటీవల అక్కడ ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయడానికి వందలాదిమంది ఎగబడ్డారు. దీంతో అది 23.9 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ.200 కోట్లకంటే ఎక్కువ.

నిజానికి రూ.200 కోట్లకు పలికిన ఆ స్థలంలో ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్ ‘ఏఐ క్యాప్‌వన్’ నివసించాడు, అతడు చనిపోయిన తరువాత అతని భవనం నేలమట్టం చేసారు. ఆ స్థలానికి అంత రేటు పలకడానికి కారణం అక్కడ గ్యాంగ్‌స్టర్ నివాసముండటమే అని కొందరు భావిస్తున్నారు. ఈ స్థలం మొత్తం 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం.
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అక్కడ నివాసముండటం వల్ల ఆ స్థలం బాగా పాపులర్ అయింది. దీంతో ఆ స్థలం గురించి చాలామందికి తెలిసింది. అందులోనూ అది పూర్తిగా ఖాళీ స్థలం కావడం వల్ల ఎక్కువమంది తమకు నచ్చినట్లు ఇల్లు కట్టుకోవచ్చని ఎగబడ్డారు. 2021లో ఈ స్థలం విలువ 10.75 మిలియన్లని.. ఆ తరువాత ఇప్పుడు ఆ భూమి విలువ రెట్టింపు ధరకు పలికినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Recent Comments