ఇచ్చోడా , ( రిపబ్లిక్ హిందూస్థాన్ ) : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం మేజర్ గ్రామపంచాయతీ లో అభివృద్ధి పనులు జరగక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికపరంగా పుష్కలంగా నిధులు ఉన్నా అభివృద్ధి జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు.




పట్టణ ప్రగతిలో జరిగిన అభివృద్ధి ఇదేనా..??
పట్టణ ప్రగతిలో జరిగిన అభివృద్ధి ఇదేనా..??
గ్రామాల్లో,పట్టణాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది.కానీ ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాం పుర,రంజాన్ పుర కాలనీలలో పట్టణ ప్రగతి చేతల్లో కాదు కేవలం రాత లకే పరిమితమైదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి వర్షానికే ఈ కాలనీలలోని రోడ్లు బురదమయమై ప్రజలు,వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురికి నీరు గుంతల్లో నిలువడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి.తద్వారా కాలనీవాసులు వ్యాధుల బారిన పడుతున్నారు.మా కాలనీలను అభివృద్ధి చేయడంలో ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు సవతితల్లి ప్రేమను చూపించడంలో అంతర్యం ఏమిటి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకపోతే కాలనీలలోని సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కాలనీవాసులు అంటున్నారు.



Recent Comments