ములుగు జిల్లా:జనవరి 26
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పతాకావిష్కరణ చేస్తుండగా జెండా పైపుకు విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు.
వారిలో ఇద్దరు మృతిచెం దగా, మరొకరు మృత్యువు తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఈ విషాద సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో జరిగింది. స్థానిక యువకులకు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్ పైప్ తో జెండా కడుతు న్నారు.
ఈ క్రమంలో ఇనుప పైప్ నకు విద్యుత్ వైర్లు తగిలాయి. జెండాకు విద్యుత్ వైర్లు తాకడంతో విజయ్, చక్రి, అజిత్ అనే ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు.
ఈ క్రమంలో వారిని వెంటనే ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు.చికిత్స పొందుతూ అజిత్, విజయ్ అనే ఇద్దరూ మృతి చెందారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. మృతుల కుటుoబాలను పరామర్శించిన సీతక్క గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు…
ములుగు జిల్లాలో గణతంత్ర వేడుకల్లో అపశృతి
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments