సూర్యాపేట జిల్లా: జనవరి 24
సూర్యాపేట జిల్లాలో ఎఆర్ కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్రూరి సైదులు అనే యువకుడు సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
పెన్‌పహాడ్ మండలం ధర్మపురం వ్యవసాయ క్షేత్రం వద్ద అతడు మంగళవారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది .
పెనపహాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఆర్థిక సమస్యలతో కుటుంబ కలహాలు చెలరేగడంతోనే సదరు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు…
Recent Comments