మహారాష్ట్ర :జనవరి 19:
అయోధ్యలో రామ్ మందిర్‌లో విగ్రహం మహా ప్రతిష్ఠాపన జరగనున్న రోజు సోమవారం (22న) సెలవు దినంగా మహారాష్ట్ర శుక్రవారం ప్రకటించింది.
హోమ్ మంత్రిత్వశాఖ కేటాయించిన అధికారాలను వినియోగిస్తూ 22న సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ఉత్తర్వులో తెలియ జేసింది.
రామ్ మందిర్‌లో ‘ప్రాణ్ ప్రతిష్ట్’ సందర్భంగా దేశం అంతటా తన కార్యాల యాలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు 22న అర రోజు సెలవు ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
అదే సందర్భంలో 22న తన కార్యాలయాలు అన్నిటినీ మూసివేయనున్నట్లు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.
కాగా, సోమవారం అర రోజు సెలవును హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.
ఈనెల 22న సెలవు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
RELATED ARTICLES
Recent Comments